కడప జిల్లాలో కూటమి ప్రభంజనం: జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం
రిపోర్టర్: రమేష్
స్థలం: కడప
ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ స్థానంతో పాటు మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకుందని, వైకాపా కేవలం రెండు స్థానాలకే పరిమితమైందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా తెదేపా ముప్ పై స్థానాల్లో, భాజపా మూడు, జనసేన మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేశాయని వారు స్పష్టం చేశారు.