యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు ఒక్కరోజే సమకూరిన రూ. 12 లక్షల ఆదాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం వివిధ విభాగాల ద్వారా మొత్తం పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రెండు రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్, బ్రేక్ దర్శనాలు, వీఐపీ దర్శనాలు, కార్ పార్కింగ్, ప్రసాద విక్రయాలు అలాగే లీజుల రూపంలో ఈ భారీ మొత్తంలో భక్తులు కానుకలు సమర్పించారు.