ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ మెట్పల్లిలో ఆర్డీవో కార్యాలయం ముట్టడించిన భాజపా
రిపోర్టర్: గోపి
స్థలం: మెట్పల్లి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతలు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్డీఓ నరసింహారావుకు వినతిపత్రం అందజేసినట్లు నేతలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుప్రావ్, పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్, పుర కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, వేణుగోపాల్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.