పాకిస్థాన్ క్రికెటర్లలో పోరాట పటిమ లోపించింది: ఏబీ డివిలియర్స్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో పోరాట పటిమ, కసి పూర్తిగా లోపించాయని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ విమర్శించారు. కఠిన పరిస్థితుల్లో బ్యాటర్లు కష్టపడి ఆడే గుణం చూపడం లేదని అన్నారు. కేవలం బోర్డును తప్పుపట్టడం కాకుండా ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని, టెస్టు క్రికెట్‌లో విజయాల కోసం మానసిక దృఢత్వం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.