రూ.1.47 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం: నిమ్మల రామానాయుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి మరియు చందపర్తు గ్రామాలలో రూ.1.47 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించినట్లు జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పూలపల్లిలో రూ.76.10 లక్షలతో మూడు గ్రావెల్ రోడ్లు, రూ.39.50 లక్షలతో నాలుగు సిసి రోడ్లు, అలాగే చందపర్తులో రూ.11 లక్షలతో ఒక గ్రావెల్ రోడ్డు, రూ.20 లక్షలతో రెండు సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.