హైదరాబాద్‌లో పట్టపగలు వేటకొడవలితో పాల వ్యాపారిపై దాడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Vanasthalipuram, Hyderabad

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనంగా వనస్థలిపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో సురేంద్ర సింగ్ అనే వ్యక్తి పాల వ్యాపారి భుజంగరావుపై పట్టపగలు వేటకొడవలితో దారుణంగా దాడి చేశాడు. గుర్రంగూడలోని ఓ ప్లాట్ వివాదమే ఈ దాడికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.