ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల విజేతల జాబితా విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ ప్రభుత్వం 2026 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల జాబితాను ప్రకటించింది. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు 79 మంది స్కూల్ టీచర్లు, 24 మంది ఇంటర్ లెక్చరర్లను అవార్డులకు ఎంపిక చేశారు. విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు రూ.20 వేల నగదు బహుమతిని ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్న మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా పూర్తి చేసింది.