జూరాల కాలువలోకి దూకి రైతుల తీవ్ర నిరసన

రిపోర్టర్: రాము స్థలం: జూరాల ప్రాజెక్టు

జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ పోలీసు పహారాను సైతం లెక్కచేయకుండా రైతులు ఒక్కసారిగా కాలువలోకి దూకి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించడంతో వాగ్వాదం జరిగింది.