విజయనగరంలో ముగిసిన ప్రచారం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరించిన కలెక్టర్
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం అయిదు గంటలతో తెరపడనుందని జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రామ్‌సుందర్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మైకులు, లౌడ్ స్పీకర్లు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.