కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏడువేల ఐదువందల సైకిళ్ల పంపిణీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు విద్యాచక్రం పథకం ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏడువేల ఐదువందల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. పట్టణంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఐదు విద్యాసంస్థల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఎస్సార్సీ కంపెనీ సహకారంతో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.