ఫుట్‌బాల్ మ్యాచ్ లో విషాదం: గోల్‌కీపర్ తో ఢీకొని ఆటగాడు మృతి
రిపోర్టర్: మహేష్
స్థలం: స్పెయిన్
స్పెయిన్ లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీడీ టెనెరిఫ్, ఎఫ్‌సీ ఆండోరా క్లబ్‌ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో టెనెరిఫ్ ఆటగాడు జీసస్ డి మిగెల్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు క్లబ్ వర్గాలు వెల్లడించాయి. బంతిని అందుకునే క్రమంలో గోల్‌కీపర్ జీసస్ ఓనోను బలంగా ఢీకొనడంతో మిగెల్ ఛాతీకి తీవ్ర గాయమై మైదానంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.