పలాసలో కామేశ్వరరావు విజయంతో కదంతొక్కిన పసుపు శ్రేణులు

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరో వార్డు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంధం కామేశ్వరరావు ఘన విజయం సాధించారు. అన్రిజర్వ్డ్ జనరల్ స్థానం నుండి గెలుపొందిన ఆయనకు మద్దతుగా టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ గెలుపుతో స్థానిక నాయకులలో ఆనందం వెల్లివిరిసింది.