రిమ్స్ నిర్వహణకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రిమ్స్ నిర్వహణకు రూ.150 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన విషాద ఘటన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రత్యేక వైద్యుల బృందాన్ని పంపాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.