వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ నిర్లక్ష్యం: ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
రిపోర్టర్: హరి
స్థలం: గుంటూరు
వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు హయాంలో రూ.5,233 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ హయాంలో కేవలం రూ.841 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. 2014-19 మధ్య రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు రూ.12,484 కోట్లు వెచ్చించారని, జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. పోలవరం విషయంలోనూ వైఎస్సార్, జగన్ ప్రభుత్వాల కంటే చంద్రబాబు ప్రభుత్వమే అత్యధిక నిధులు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు.