రాజాంలో వైకాపాకు భారీ షాక్: టీడీపీలో చేరిన ముప్పై కుటుంబాలు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. రాజాం మండలం అంతకాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముప్పై కుటుంబాలు టీడీపీలోకి వచ్చాయన్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.