సింహాచలంలో అప్పన్న స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్న స్వామిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.