మహిళలకు తక్షణ సహాయం: విజయనగరం జిల్లాలో జెండర్ రిసోర్స్ కేంద్రాల ప్రారంభం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయాన్ని అందించే విధంగా ప్రభుత్వం జెండర్ రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరంలోని వెలుగు కార్యాలయంలో ఒక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాత్రి వేళల్లో మహిళలకు సేవలందించే ఈ కేంద్రాల్లో మహిళా పోలీసులు, ఆరోగ్య సహాయకులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో మరో పదకొండు కేంద్రాలు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు.