బెల్లంపల్లిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్‌బాబు, కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.