పోలేరమ్మ తల్లి జాతర ఆహ్వాన పత్రికను అందుకున్న మంత్రి ఆనం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అక్టోబర్ ఆరు, ఏడు, ఎనిమిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు విచ్చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.