హైదరాబాద్‌లో మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ పట్ల హోంగార్డు ఆనంద్ అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. విధుల్లో ఉన్న సమయంలో మహిళతో వాగ్వాదానికి దిగి, ఆమె చెంపదెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు స్పందించి సదరు హోంగార్డును వికారాబాద్‌కు బదిలీ చేస్తూ శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు.