ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న ఆనంద్ దేవరకొండ 'ఎపిక్'

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్’ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అయితే, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ సెప్టెంబర్ 10 సాయంత్రమే తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. హెషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.