తెలంగాణలో పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో హోంశాఖ పరిధిలోని 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ప్రకటించింది. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యోగాల కోసం మొత్తం 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.