జర్నలిస్టులకు తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలంటూ కలెక్టర్ కు వినతి

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు మూడవ విడత అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కోరారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ కు వారు వినతిపత్రం అందజేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కోరారు.