చిరంజీవి, రామ్ చరణ్‌లను కలిసిన రవితేజ 'ఇరుముడి' చిత్రబృందం.

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 225 కోట్లకు పైగా వసూలు చేసి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను రవితేజతో పాటు చిత్ర యూనిట్ మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా విజయవంతం కావడంపై మెగా హీరోలు చిత్రబృందాన్ని అభినందించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.