మద్యం నిషేధించిన పంచాయతీలకు ప్రత్యేక నిధులివ్వాలని రమేష్ గర్జన
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో మద్యం నిషేధించాలని గ్రామసభల్లో తీర్మానాలు చేసిన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అదనపు ప్రోత్సాహకాలు కల్పించాలని ప్రజా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పెంట రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన మద్య వినియోగం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంటూ గ్రామాలను మద్యరహితంగా మార్చేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని కోరారు.