వైద్య కళాశాలలో కాపీయింగ్ కలకలం: మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: నంద్యాల

నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో వెలుగుచూసిన పరీక్షల కాపీయింగ్ వ్యవహారంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వైద్య విద్య నాణ్యతలో రాజీ పడేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమాలకు కారణమైన వారితో పాటు సహకరించిన ప్రతి ఒక్కరి పాత్రపై వారం రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికను తనకు సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.