ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వారంలో ఐదు రోజుల పని విధానం డిమాండ్తో ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. సమ్మె కాలంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ నెల 27న ఆదివారం నాడు బ్యాంకులు తెరచుకోనున్నాయి. సమ్మె సమయంలో ఏటీఎంలలో నగదు ఉపసంహరణ లావాదేవీలపై ఎలాంటి రుసుములు ఉండవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర ప్రభుత్వ బ్యాంకులు స్పష్టం చేశాయి.