వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. తనకు ఎలాంటి భౌతిక నోటీసులు అందలేదని, కేవలం ఫోన్ ద్వారానే అధికారులు సమాచారం ఇచ్చారని అంబటి తెలిపారు. అయితే ఏ కేసులో విచారణకు పిలుస్తున్నారనేదానిపై స్పష్టత లేదని ఆయన వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.