విజయవాడలో దారుణం: పక్కనే ఉండే వ్యక్తి చేతిలో వివాహిత హత్య

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కూర్మయ్య బ్రిడ్జ్ సమీపంలో సునీత అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. ఇంటి పక్కనే నివసించే నాగరాజు అనే వ్యక్తి పాత పరిచయాల నేపథ్యంలో సునీతపై కత్తితో దాడి చేసి హతమార్చాడని పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె ఘటనాస్థలిలోనే మృతి చెందిందని, నిందితుడు ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు పట్టుకుని ఆస్పత్రిలో చేర్పించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సూర్యారావుపేట సీఐ చవాన్ స్పష్టం చేశారు.