ఏదులాపురంలో మృతుల కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఖమ్మం

ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో అక్టోబర్ నెలలో మృతి చెందిన ముప్ పై ఎనిమిది కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు చైర్పర్సన్ పోకబత్తిని అనిత తెలిపారు. కష్టకాలంలో ఉన్న బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.