సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ చౌటుప్పల్ శ్రీ సోమనాథ క్షేత్రంలో మహా మృత్యుంజయ యాగం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సోమనాథ క్షేత్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహా మృత్యుంజయ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శివలింగానికి క్షీరాభిషేకం, భజనలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ప్రతినెలా మాస శివరాత్రి సందర్భంగా లోకకల్యాణం కోసం యజ్ఞం నిర్వహిస్తున్నట్లు క్షేత్ర కమిటీ అధ్యక్షుడు బడుగు నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.