భారీ షాక్: మూడు వేల మంది ఉద్యోగులను తొలగించిన ఫిసర్వ్ సంస్థ

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం ఫిసర్వ్ కంపెనీ గతేడాది జూన్ నుండి మూడు వేల మంది ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లను తొలగించినట్లు సంస్థ సీఈఓ టాకిస్ జార్జకోపౌలోస్ వెల్లడించారు. సంస్థ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఎలివేట్ కింద ఈ భారీ కోత విధించినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యయాలను తగ్గించుకునే దిశగా అగ్రస్థాయి మేనేజ్మెంట్ బృందంలోనూ పది శాతానికి పైగా కోత పెట్టినట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.