ప్రకాశం బ్యారేజీకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Vijayawada
కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలంలో సరైన వర్షాలు లేక అల్లాడిపోయిన కృష్ణా డెల్టా రైతాంగానికి ఈ వరద నీరు ఊరటనిచ్చింది. బ్యారేజీకి శుక్రవారం 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. దిగువకు మరియు వివిధ ఛానెళ్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుడమేరు వాగు పొంగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు తగు చర్యలు చేపట్టారు.