రోడ్డు ప్రమాద బాధితుడి నగదును ఆస్పత్రి సిబ్బందికి అప్పగించిన 108
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
మహేష్ అనే వ్యక్తి బైక్ పై ప్రయాణిస్తూ జారిపడి గాయపడగా, ఆలేరు 108 సిబ్బంది వెంకటేష్, ప్రశాంత్ తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడి వద్ద ఉన్న పదిహేను వేల నగదు, మొబైల్‌ను సురక్షితంగా ఆస్పత్రి సిబ్బందికి అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు.