హార్దిక్ పాండ్యా మ్యాచ్ ప్రాక్టీస్ కీలకమన్న కోచ్ గౌతమ్ గంభీర్
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వర్క్ లోడ్ మరియు మ్యాచ్ ప్రాక్టీస్ అత్యంత కీలకమని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ తర్వాత హార్దిక్ తగినన్ని మ్యాచ్‌లు ఆడలేదని, ప్రపంచకప్‌నకు సిద్ధమయ్యే ముందు అతనికి తగినంత ఆట సమయం దక్కాలని గంభీర్ పేర్కొన్నారు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.