డీజీపీ కార్యలయంలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: సునీల్ స్థలం: Telangana

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని శనివారం డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ పోలీస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐజీ పి మరియు ఎల్ గజరావు భూపాల్ పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించినట్లు పేర్కొన్నారు. దేశ సమైక్యతను కాపాడాలని ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించినట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.