భారీ కొనుగోలు: ఫ్లోరిడాలో అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన మార్క్ జుకర్బర్గ్

రిపోర్టర్: రాము స్థలం: Florida

మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్ తో కలిసి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఇండియన్ క్రీక్ ఐలాండ్ లో భారీ విలాసవంతమైన భవనాన్ని సుమారు నూట డెబ్బై మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్థిక పత్రిక ఫార్చ్యూన్ స్పష్టం చేసింది. బిలియనీర్స్ బంకర్ గా పిలిచే ఈ ప్రాంతంలో జెఫ్ బెజోస్ వంటి ప్రముఖుల ఇళ్లకు సమీపంలో ఈ నూతన భవనం ఉండటం గమనార్హం.