మురసు తుఫాన్ హెచ్చరిక: పంట కోతలను వాయిదా వేసుకోవాలని తుమ్మల సూచన
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పంటలు వర్షాలకు తడిసి నష్టపోకుండా ప్రస్తుత కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కోరారు. కోసిన పంటలను సురక్షిత ప్రాంతాల్ లో భద్రపరచుకోవడంతో పాటు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.