నాటి సీఎంవో కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం అంటూ రజత్ భార్గవ సంచలన వాంగ్మూలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక వాంగ్మూలమిచ్చారని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. నాటి సీఎంవో అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. లంచాల కోసమే మద్యం మూల ధరలను భారీగా పెంచేశారని, ఆ జీవోలు జారీ చేయాలని అప్పటి సీఎం జగన్ పట్టుబట్టారని రజత్ భార్గవ సీఆర్పీసీ సెక్షన్ల కింద ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.