నెల్లూరు జిల్లాలో బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఎక్సైజ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరుపూరు, కలిచేడు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న చేజర్ల పెంచలయ్య, షేక్ మౌలా సాహెబ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వేంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సైలు అంజయ్య, అయ్యప్ప పాల్గొన్నారు.