సైబర్ నేరాలపై హెచ్చరిక: బ్యాంక్ ఖాతాదారులకు నిపుణుల కీలక సూచనలు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు, వ్యక్తిగత పాస్వర్డ్లను ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు రిమోట్ యాప్స్ ఇన్స్టాల్ చేయమంటే చేయరాదని పేర్కొన్నారు. మోసగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకోవద్దని, అత్యవసర సమయాల్లో అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలని సైబర్ భద్రతా అధికారులు సూచించారు.