చిత్తూరు ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం: అర్ధగిరిలో రామ రక్షా విగ్రహం ప్రతిష్ఠ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చిత్తూరు
చిత్తూరు ప్రాంతంతో తన కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఉపాసన గుర్తుచేసుకున్నారు. అపోలో విద్యాసంస్థల ద్వారా వేలాది మంది విద్యనభ్యసిస్తుండటం సంతోషకరమని ఆమె తెలిపారు. త్వరలోనే ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రామ రక్షా విగ్రహాన్ని అర్ధగిరి ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. తన తాతయ్య ప్రతాప్ సి.రెడ్డి పుట్టిన నేలతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని సోషల్ మీడియా వేదికగా ఆమె స్పష్టం చేశారు.