వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. హైదరాబాద్‌లో కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్రంలోని వ్యవసాయ, విద్యుత్ పరిస్థితులను వివరించి వినతిపత్రం అందజేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, మిగతా గ్రామీణ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.