యూకే వీసాల పేరుతో మోసం: విచారణలో ఏడ్చిన యూట్యూబర్ రమానందన

రిపోర్టర్: శివ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

యూకే ఉద్యోగాలు, ఫేక్ వీసాల పేరుతో మోసాలకు పాల్పడిన యూట్యూబర్ రమానందనను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించారు. మూడు గంటల పాటు సాగిన విచారణలో ఆమె అధికారులకు సహకరించకుండా భర్త మధుకర్‌పై నెపం నెట్టారు. విచారణ సమయంలో భావోద్వేగానికి గురై బోరున ఏడ్చారు. అద్దంకి పీఎస్‌లోనూ కేసు ఉండటంతో ఈ నెల 17న హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.