రష్యా యుద్ధభూమిలో విశాఖ యువకుల చిక్కులు: సెల్ఫీ వీడియోతో కన్నీటి పర్యంతం

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నం దువ్వాడకు చెందిన ఐదుగురు యువకులు ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫుడ్ ప్యాకేజింగ్ ఉద్యోగం పేరుతో ఓ ఏజెంట్ మోసం చేసి వారి చేత బలవంతంగా ఆర్మీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురి ఆచూకీ గల్లంతు కాగా, బంకర్లలో తలదాచుకున్న మిగిలిన ఇద్దరు యువకులు సెల్ఫీ వీడియో విడుదల చేసి తమను ప్రాణాలతో రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కన్నీళ్లతో వేడుకున్నారు.