లాస్ ఏంజిల్స్ లీకర్స్ జట్టు నుండి బ్రోనీ జేమ్స్ ఔట్

రిపోర్టర్: సతీష్ స్థలం: లాస్ ఏంజిల్స్

లాస్ ఏంజిల్స్ లీకర్స్ జట్టు యంగ్ గార్డ్ బ్రోనీ జేమ్స్ ను కోచేల్లా వ్యాలీ లీకర్స్ కు పంపినట్లు కోచ్ జెజె రెడిక్ వెల్లడించారు. ఈ సీజన్ లో అతను ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రీ సీజన్ మ్యాచ్ లలో బ్రోనీ ప్రదర్శన నిరాశపరచడంతో పాటు బ్యాక్ అప్ పాయింట్ గార్డ్ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాడని కోచింగ్ సిబ్బంది పేర్కొన్నారు.