ఖమ్మంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్లతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్తో చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్నేరు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. గుడిసెల్లో నివసించే వారికే ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.