గన్ను వదిలి పెన్ను పట్టి పదో తరగతిలో ప్రతిభ చూపిన మాజీ మావోయిస్టులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఛత్తీస్‌గఢ్

జనజీవన స్రవంతిలోకి వస్తున్న మాజీ మావోయిస్టులు చదువు ద్వారా కొత్త జీవితానికి బాటలు వేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో పదో తరగతి పరీక్షలు రాసిన మాజీ కామ్రేడ్ వేసు అత్యధిక మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సునీల్, చంపా, దూల మడ్కాం వంటి పలువురు మాజీలు కష్టపడి చదివి ఉత్తీర్ణులయ్యారని, పునరావాస క్యాంపుల్లో శిక్షణ పొందడానికి ఈ విద్యార్హతలు ఎంతగానో దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.