డిజిటల్ కార్పొరేషన్కు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కడం గర్వకారణమన్న మంత్రి పార్థసారథి

రిపోర్టర్: మహేష్ స్థలం: ఏలూరు

ఢిల్లీలో జరిగిన నూట తొమ్మిదో స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్కు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమని గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అమరావతి క్వాంటం వ్యాలీ అంశంలో డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ విభాగంలో ఈ పురస్కారం లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడం రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ పురోగతికి నిదర్శనమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.