'ఎయిర్‌పోర్టు స్థాయి సదుపాయాలతో...': 13 హైటెక్ బస్ స్టేషన్ల నిర్మించనున్న TGSRTC

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 13 నూతన హైటెక్ బస్ స్టేషన్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టు స్థాయి సదుపాయాలు, షాపింగ్ హబ్స్ మరియు మల్టీప్లెక్స్ రేంజ్ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్ విధానంలో ఈ మోడల్ బస్టాండ్లను నిర్మించనున్నారు. ఎండీ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు మెరుగైన వసతులు లభించడంతో పాటు బస్టాండ్లు సరికొత్త కళను సంతరించుకోనున్నాయి.